modi: ఎవరైనా మోదీ బయోపిక్ ను ఎందుకు చూస్తారు?: మమతా బెనర్జీ

  • ఎవరైనా గాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్ర చూడాలనుకుంటారు
  • దేశానికి మోదీ ఏం చేశారన్న మమత
  • ఈనెల 12న విడుదల కావాల్సి ఉన్న మోదీ బయోపిక్
ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా తెరక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరాయి.

మరోవైపు ఈ సినిమాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల బయోపిక్ లను చూడాలని దేశం కోరుకుంటుందని... మోదీ జీవిత చరిత్రను కాదని అన్నారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరైనా మోదీ బయోపిక్ ను ఎందుకు చూస్తారని ఎద్దేవా చేశారు.
modi
biopic
mamata banerjee

More Telugu News