రేపు సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు

04-04-2019 Thu 16:01
  • ఈ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్ దంపతులు
  • ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం 
  • రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 6వ తేదీన వేడుకలు

రేపు సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఉగాది వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పాల్గొననున్నారు.