Prabhas: 'సాహో' కోసం ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతంటే .. !

  • షూటింగు దశలో 'సాహో'
  • ప్రత్యేక ఆకర్షణగా ప్రభాస్ బైక్
  • బైక్ ధర 10 లక్షలకి పైనే    

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ బైక్ రైడింగ్ కి సంబంధించిన సన్నివేశాలను కొంతకాలం క్రితం షూట్ చేశారు. ఆ బైక్ కి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి రావడంతో, దాని గురించి అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ బైక్ కు సంబంధించిన వివరాలు ...ఈ సినిమా కోసం ప్రభాస్ 'ట్రిమ్ప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్' అనే బైక్ ను ఉపయోగించాడు. 765 సీసీ లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ ద్వారా ఈ బైక్ కి పవర్ సప్లై అవుతుందట. ఈ బైక్ టాప్ లైన్ మోడల్ ధర (ఎక్స్ షోరూమ్ ధర) 10.55 లక్షలు అని తెలుస్తోంది. ఈ మోడల్ బైక్ ను ఇంతకుముందు బాలీవుడ్లోనే కాదు, 'మిషిన్ ఇంపాసిబుల్'తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ఉపయోగించారట. ఈ బైక్ పై మనసు పారేసుకున్న ప్రభాస్, దానిని తన సొంతానికి వాడుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. 

More Telugu News