Andhra Pradesh: ఏపీ డీజీపీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు.. ఢిల్లీకి రావాలని ఆదేశం!

  • ఢిల్లీకి బయలుదేరిన ఠాకూర్
  • వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలోనే ఈసీ చర్య
  • ఈరోజు మధ్యహ్నం ఈసీ ఫుల్ బెంచ్ ముందు హాజరు

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి పిలుపు వచ్చింది. తమ ముందు హాజరు కావాలని ఈసీ నుంచి ఆదేశాలు రావడంతో ఠాకూర్ ఈరోజు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈసీ ఫుల్ బెంచ్ ముందు ఠాకూర్ హాజరయ్యే అవకాశముంది.

కాగా, అధికార టీడీపీకి ఠాకూర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈసీ ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. కాగా, ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న పోలీసుల బదిలీలు, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య తదనంతర పరిణామాలపై డీజీపీని ఈసీ వివరణ కోరే అవకాశమున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాగా, సాక్షాత్తూ డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలిపించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

More Telugu News