Putta sudhakar Yadav: పుట్టా ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్.. అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రమేష్!

  • ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది?
  • ఎవరు పంపించారు?
  • ఏం దొరికిందో చెప్పండి?

ఐటీ అధికారులపై టీడీపీ నేత సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు, నగదు లభ్యం కాలేదు. అయితే అధికారులు అక్కడి నుంచి వెళ్లబోయే సమయానికి పుట్టాతో పాటు సీఎం రమేశ్ అక్కడికి చేరుకున్నారు. నేరుగా అధికారులు తనిఖీలు చేసిన గదికి వెళ్లి వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పుట్టా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఎవరు పంపించారు? అంతా వెదికారు కదా, ఏం దొరికిందో చెప్పండి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే పుట్టా ఇంటిపై ఐటీ రైడ్స్ విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకుని అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. జగన్, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

More Telugu News