Krishna District: అదే జరిగితే, చంద్రబాబుకు డిపాజిట్ కూడా దక్కదు: వైఎస్ జగన్
- చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నారు
- ఆయనకు ఎల్లో మీడియా కొమ్ము కాస్తోంది
- ఓటర్లకు డబ్బు పంచాలని బాబు చూస్తున్నారు
ఏపీలో చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ కనుక జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు డిపాజిట్ కూడా దక్కదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నారని, ఆయనకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా కూడా కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.
రోజుకో కథ, డ్రామా చూపిస్తారని, రోజుకో పుకారు పుట్టించి వాటిపై చర్చ జరుపుతారే తప్ప, చంద్రబాబు పాలనపై మాత్రం చర్చ జరపరని విమర్శించారు. ఈ కుట్రల్లో భాగంగా ప్రతి గ్రామానికి చంద్రబాబు మూటలతో డబ్బులు పంపించి ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తారని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.