lakshmis ntr: ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు మరోసారి అడ్డంకి.. పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు!

  • సినిమా విడుదలకు సంబంధించిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నందువల్ల విచారించలేమని వ్యాఖ్య
  • తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా

సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీలో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.... ఈ చిత్రం విడుదలైతే ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని టీడీపీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, ఏపీలో ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదల కాలేదు.

ఈ క్రమంలో, ఈ చిత్రం విడుదలకు సంబంధించి పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈ రోజు విచారించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల దీనిపై ఇప్పటికిప్పుడే విచారణ జరపలేమని తెలిపింది. ఈ సినిమా ప్రివ్యూని కూడా ఇప్పుడు చూడలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, ఏపీలో ఈ సినిమా విడుదలకు మళ్లీ బ్రేక్ పడినట్టైంది.

More Telugu News