manchu vishnu: శ్రీను వైట్ల తదుపరి హీరోగా మంచు విష్ణు

  • సక్సెస్ కి దూరమైన మంచు విష్ణు
  • శ్రీను వైట్లకి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన విష్ణు 
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఢీ'          
కొంతకాలంగా మంచు విష్ణుకి సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. తనకి బాగా అచ్చొచ్చిన యాక్షన్ కామెడీని నమ్ముకున్నా ఆయనకి కలిసి రాలేదు. దాంతో మంచికథ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఆయన, త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. తన తదుపరి సినిమా శ్రీను వైట్లతో వుండనుందనే విషయాన్ని విష్ణు స్వయంగా చెప్పాడు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. 12 యేళ్ల తరువాత తాను శ్రీను వైట్లతో సినిమా చేయనున్నానని అన్నాడు. 12 యేళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఢీ' .. భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా శ్రీను వైట్లకి కూడా సక్సెస్ అనేది లేదు. ఆ సక్సెస్ కోసం ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతోంది. మరి ఈ ఇద్దరూ కలిసి ఈ సినిమాతో మళ్లీ హిట్ బాట పడతారేమో చూడాలి.
manchu vishnu
srinu vaitla

More Telugu News