Chandrababu: చంద్రబాబుకు గెలిచే సీన్ లేదని ఆర్టిస్టులు కూడా ఆయనకు ప్రచారం చేయట్లేదు: విజయసాయిరెడ్డి

  • తన సభలకు జనాలు రావడం లేదని బాబుకు తెలిసింది
  • జనాలను రప్పించేందుకు నానా తంటాలు 
  • కె.రాఘవేంద్రరావు ద్వారా ఆర్టిస్టులను రప్పించే యత్నం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవరని తెలిసి ఆయన తరపున ప్రచారం చేసేందుకు రాకుండా, సినీ ఆర్టిస్టులు కూడా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ఇతర రాష్ట్రాల నాయకుల ప్రచారం ముగిసిందని, చంద్రబాబు తన సభలకు జనాలు రావడం లేదని తెలిసి, కె.రాఘవేంద్రరావు ద్వారా సినీ హీరోలు, కథానాయికలను రప్పించడానికి నానా తంటాలు పడుతున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబుకు గెలిచే సీన్ లేదని అర్థం కావడంతో జూనియర్ ఆర్టిస్టులు కూడా ఆయన తరపున ప్రచారం చేసేందుకు ఇష్ట పడటంలేదని, అందుకే, వారు తప్పించుకు తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు.
Chandrababu
Telugudesam
cm
YSRCP
mp
vijayasai

More Telugu News