Telangana: ‘పోతిరెడ్డిపాడు’ను మూసేయాలంటున్న వారికా జగన్ మద్దతు?: టీడీపీ ఎంపీ కనకమేడల

  • రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతున్నారు
  • ‘పోతిరెడ్డిపాడు’ మూసేస్తే రాయలసీమ ఎడారే
  • ముచ్చుమర్రి ప్రాజెక్టు కూడా మూసేయాలట

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, అటువంటి వారికి జగన్ మద్దతు పలుకుతారా? అని మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ముచ్చుమర్రి ప్రాజెక్టులను మూసేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోందని విమర్శించారు. అదే కనుక జరిగితే రాయలసీమ ఎడారి అయిపోతుందని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీరందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీనే ప్రధానమని చెప్పారు. వీటిని మూసేస్తే రాయలసీమలో సాగయ్యే లక్షల ఎకరాలు సహా, తెలుగు గంగ కాలువ ద్వారా చెన్నైకు తాగునీరందించేందుకు అవకాశం ఉండబోదని అన్నారు. 

More Telugu News