‘రైతు బంధు’ డబ్బులు ఇవ్వలేదో.. లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తాం!: నిజామాబాద్ రైతుల వార్నింగ్
- జిల్లాలోని కేశుపల్లి వాసుల అల్టిమేటం
- ఇంకా రైతులకు అందని రైతు బంధు చెక్కులు
- అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం
- రైతుల నిర్ణయంపై ఇంకా స్పందించని అధికారులు
జిల్లాలోని కేశుపల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు చెక్కులు అందలేదు. అధికారులను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరికి విసిగిపోయిన గ్రామస్తులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. ఈ నెల 10లోగా రైతు బంధు చెక్కులు తమకు అందేలా చర్యలు తీసుకోవాలనీ, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.