namo TV: ఎన్నికల ముందు ‘నమో టీవీ’ ప్రారంభంపై విపక్షాల ఆగ్రహం

  • కోడ్‌ అమల్లో ఉండగా ఇదెలా సాధ్యమని ప్రశ్న
  • అన్నీ బీజేపీ అనుకూల అంశాలే ప్రసారం అవుతున్నాయని ఆరోపణ
  • కోడ్‌ ఉల్లంఘనపై సమాచార మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన ఈసీ

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా బీజేపీకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేసే ‘నమో టీవీ’ ప్రారంభానికి ఎలా అనుమతించారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. నరేంద్రమోదీ ఫొటోతో ఉన్న లోగోను కలిగిన నమో టీవీ ఇటీవల ప్రారంభమయింది. ఈ చానల్‌లో అన్నీ బీజేపీ ఎన్నికల ప్రచారం వార్తలు, ర్యాలీలను ప్రసారం చేస్తున్నారు. అన్ని డీటీహెచ్‌ కనెక్షన్లలోనూ ఈ చానెల్‌ ప్రసారం అవుతోంది.

దీంతో విపక్షాలు మండిపడిపోతూ ఇది కోడ్‌ ఉల్లంఘన అంటూ ఈసీని ప్రశ్నించాయి. దీంతో వివరణ కోరుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. కోడ్‌ అమల్లో ఉండగా చానెల్‌ ఎలా ప్రారంభించారని కోరింది. అలాగే టీవీ నిర్వాహకుల నుంచి వివరణ కోరింది. అలాగే మార్చి 31న ప్రధాని నరేంద్రమోదీ ‘మై బీ చౌకీదార్‌’ కార్యక్రమాన్ని గంటకు పైగా ప్రసారం చేయడంపైనా వివరణ ఇవ్వాలని దూరదర్శన్‌కు లేఖ పంపింది. ఈసీ లేఖ అందిన వెంటనే సమాచార మంత్రిత్వ శాఖ చానెల్‌ లాంచ్‌పై ఆరాతీస్తోంది.

More Telugu News