eesha rebba: తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ జోడీగా ఛాన్స్ పట్టేసింది

  • హిట్ కోసం ఈషా రెబ్బ వెయిటింగ్ 
  • తెలుగులో ప్రధానపాత్రధారిగా ఒక సినిమా 
  • తమిళంలో రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్  
'అంతకుముందు ఆ తరువాత' సినిమా ద్వారా ఈషా రెబ్బా తెలుగు తెరకి పరిచయమైంది. అప్పటి నుంచి ఆమెకి అవకాశాలు లేకపోవడమంటూ లేదు .. అలాగని వరుస సినిమాలు లేవు. ఏదో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చేసుకుంటూ వెళుతుందిగానీ, ఇంతవరకూ చెప్పుకోదగిన సినిమా మాత్రం పడలేదు.

ఇటీవలే 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగానే, తమిళంలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి, ఏజిల్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తమిళంలో ఈషా రెబ్బాకి ఇది రెండవ సినిమా. ఈ సినిమాతో తమిళంలోనైనా ఈ తెలుగు అమ్మాయి బిజీ అవుతుందేమో చూడాలి.
eesha rebba
prakash kumar

More Telugu News