Congress: బీజేపీ రాజకీయాలు దేశానికి ప్రమాదకరం: గులాంనబీ అజాద్‌

  • కాంగ్రెస్‌ అభివృద్ధి గురించి మాట్లాడుతోంది
  • బీజేపీ నాయకులు దూషణ పర్వాన్ని నమ్ముకున్నారని విమర్శ
  • తాము ఈవీఎంలు తెస్తే వారు వాటితో మోసాలకు పాల్పడుతున్నారని ధ్వజం

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ అజాద్‌ అధికార బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. మతపరమైన అంశాలను అడ్డం పెట్టుకుని కాషాయ దళం రాజకీయాలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాల వల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటితో పోల్చితే ఇప్పుడు ఎక్కువ మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో తామెప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నామని, బీజేపీ నాయకులు మాత్రం అభివృద్ధి గురించి చెప్పకుండా దూషణలకు పరిమితమవుతున్నారని విమర్శించారు.

ఎన్నికల విధానాన్ని సరళతరం, వేగవంతం చేసేందుకు ఈవీఎంలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమల్లోకి తెస్తే, వాటితో బీజేపీ ప్రభుత్వం మోసాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందన్నారు. మేము తీసుకువచ్చినప్పుడు వంద శాతం ఈవీఎంలు పనిచేసేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

  • Loading...

More Telugu News