Niharika: నాన్నకు మద్దతుగా నరసాపురంలో నిహారిక ప్రచారం!

  • నరసాపురం నుంచి పోటీ చేస్తున్న నాగబాబు
  • ప్రచారానికి వచ్చిన నటి నీహారిక
  • తండ్రికి ఓటేయాలని విజ్ఞప్తి
తన తండ్రి నాగబాబు, నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి జనసేన తరఫున పోటీలో దిగగా, ఆయన కుమార్తె, సినీ నటి నీహారిక ప్రచారానికి వచ్చారు. తండ్రి తరఫున ప్రచారం చేసిన ఆమె, ఈ ప్రాంతం తమ సొంత ప్రాంతమని, ఇక్కడి ఓటర్లు తన తండ్రిని గెలిపిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.

ఇదే సమయంలో నాగబాబు మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలనూ నెరవేరుస్తామని అన్నారు. రేషన్ బదులు రూ. 2,500 డబ్బులు ఇస్తామని, పేదలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా, పేదలు ఇంకా పేదవారిగానే ఉన్నారని, ఆర్థిక అసమానతలు పోవాలంటే, జనసేన అధికారంలోకి రావాలని అన్నారు. పోటీలో ఉన్న జనసేన అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.
Niharika
Nagababu
Narasapuram
Jana Sena

More Telugu News