Banaras Hindu University: బనారస్ హిందూ యూనివర్సిటీలో కాల్పులు.. ఎంసీఏ విద్యార్థి మృతి

  • స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా కాల్పులు
  • నలుగురు నిందితుల అరెస్ట్
  • యూనివర్సిటీ వద్ద భద్రత పెంపు

వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంసీఏ విద్యార్థి గౌరవ్ సింగ్ మృతి చెందాడు. యూనివర్సిటీలోని బిర్లా హాస్టల్ వద్ద గత రాత్రి స్నేహితులతో కలిసి మాట్లాడుతున్న గౌరవ్‌పై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షలతోనే గౌరవ్‌పై వారు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News