Chittoor District: ఆకాశంలోని చుక్కలను కూడా తెచ్చి ఇస్తానని చంద్రబాబు హామీ ఇస్తారు!: చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా

  • ఎన్నికల సమయంలోనే పథకాలు గుర్తుకొస్తాయా? 
  • రాజకీయం కోసం నా వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టను
  • ‘నమ్మకం’ అన్నది మనిషి ప్రాణంతో సమానం
ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలైనా సరే, చంద్రబాబు ఇస్తారని, వెనుకాముందూ ఆలోచించరని చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆకాశంలో చుక్కలు కావాలని ఎవరైనా కోరితే, ‘సరే తెచ్చిస్తాను’ అనే వ్యక్తి బాబు అని విమర్శించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో సంక్షేమ పథకాలు గుర్తుకురావని అన్నారు. చంద్రబాబు ప్రకటిస్తున్న ప్రతి పథకం కూడా ఏడాది క్రితం వైసీపీ ప్రకటించిన ‘నవరత్నాలు’లోనివే అని అన్నారు.

రాజకీయం కోసం తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టే వ్యక్తి కాదని, ‘నా పని అయిపోతే చాలు’ అనుకునే వ్యక్తిని కాదని చెప్పారు. ‘నమ్మకం’ అన్నది మనిషి ప్రాణంతో సమానం అని, ఆ నమ్మకాన్ని పోగొట్టుకునేలా తానెప్పుడూ ‘రాజకీయం’ చేయనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే, దాన్ని అమలు చేసి తీరతానని చెప్పారు.  ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఒక్కోసారి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతామని, ప్రజలు ఈ విషయాన్ని నమ్ముతారని ఆశిస్తున్నానని అన్నారు.
Chittoor District
chandragiri
mla
chevireddy

More Telugu News