Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు వచ్చింది: సీఎం కేసీఆర్

  • ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి జిల్లాకు సాగునీరు
  • మరో 3 నెలల్లో ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికీ నీరు
  • యాదాద్రి రూపు రేఖలు మారనున్నాయి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు వచ్చిందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, పొలాలు పచ్చగా మారతాయని సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో పది నెలల పాటు కాలువల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. డిండి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి ఇబ్రహీంపట్నం చెరువు నింపుతామని హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందుతుందని అన్నారు. యాదాద్రి రూపు రేఖలు మారనున్నాయని, ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారనుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు.   

  • Loading...

More Telugu News