Innova: చీరలతో వెళుతున్న వైసీపీ నేత వాహనాన్ని పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు

  • ఇన్నోవా వైసీపీ నేత సంజీవరావుదిగా గుర్తింపు
  • చీరలు పంచడానికే తీసుకెళుతున్నట్టు వెల్లడి
  • డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ఎక్కువయ్యాయి. చెక్ పోస్టుల వద్ద తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలించే డబ్బు, మద్యం వంటి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు వైసీపీ నేత సంజీవరావుకు చెందిన ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 100 చీరలను రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని లేబాక చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ఇన్నోవా డ్రైవర్‌ను విచారించగా చీరలు పంచడానికే తీసుకెళుతున్నామని తెలిపినట్టు తెలుస్తోంది. డ్రైవర్ పసుపులేటి సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.
Innova
Suman
Snajeeva Rao
YSRCP
Police
Case filed

More Telugu News