India: సరిహద్దులో కాల్పులు జరిపిన భారత సైన్యం.. పాకిస్థాన్‌కి చెందిన ఏడు సైనిక పోస్టులు ధ్వంసం.. మృతుల వివరాలపై సందిగ్ధం

  • పాక్ కాల్పుల్లో ఇన్‌స్పెక్టర్, స్థానిక బాలిక మృతి
  • 24 మందికి పైగా గాయాలు
  • ముగ్గురు సైనికులు మృతి చెందారన్న పాక్

పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి నిన్న పాకిస్థాన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ స్థానిక బాలిక ప్రాణాలు కోల్పోగా 24 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పాలని భావించిన భద్రతా దళాలు నేడు కాల్పులు జరిపాయి. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలపై అనూహ్య దాడులకు తెగబడుతున్న పాక్ సైనిక మూకలకు చెందిన ఏడు పోస్టులను ధ్వంసం చేశాయి.

భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌‌లోని రాఖ్‌చిక్రి, రావల్‌కోట్‌తోపాటు ఎల్‌వోసీని ఆనుకుని ఉన్న ఏడు పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్ వైపు ఎందరు మరణించారన్న విషయం తెలియరాలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు చనిపోయినట్టు పాకిస్థాన్‌కి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా రాజౌరీ, పూంచ్ సెక్టార్లలో సరిహద్దు వెంబడి పాఠశాలలకు శలవులు ప్రకటించారు. 

  • Loading...

More Telugu News