paruchuri: అప్పట్లో అసలు ఎమ్మెస్ నారాయణ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎమ్మెస్ నారాయణ నా శిష్యుడు 
  • రచయితగా నాతో కలిసి పనిచేశాడు 
  • నటుడిగా ముందుకు వెళ్లాడు    

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో నటుడు ఎమ్మెస్ నారాయణ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "నేను అధ్యాపకుడిగా వున్న సమయంలో ఎమ్మెస్ నారాయణ నా శిష్యుడు. ఆ తరువాత నేను సినీ రచయితగా చెన్నైలో ఉండగా ఒక రోజున నా దగ్గరికి వచ్చాడు. రచయితగా పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చానంటూ తన దగ్గరున్న ఒక కథ చెప్పాడు .. అదే 'ప్రయత్నం' సినిమాగా వచ్చింది. ఆ సినిమా నుంచి రచయితగా నాతో కలిసి పనిచేస్తూ వచ్చాడు. అలా పనిచేస్తూనే 'పెదరాయుడు' సినిమాలో ఒక వేషం వేశాడు. అప్పటి నుంచి నటుడిగానే చేస్తూ వెళ్లాడు. ఆ తరువాత కొంతకాలానికి వచ్చి నటుడిగా అవకాశాలు రావడం లేదని చెప్పి .. సొంతవూరు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పాడు. 'ఇండస్ట్రీ ఎవరినీ రమ్మనదు .. పొమ్మనదు' అని చెప్పాను. దాంతో ఆలోచించుకుని .. కొన్ని రోజులు వెయిట్ చేస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయనకి 'మా నాన్నకి పెళ్లి' సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా తరువాత నటుడిగా ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News