Chittoor District: జగన్ ‘లోటస్ పాండ్’ కల్వకుంట్లలో ఉంది: సీఎం చంద్రబాబు

  • లోటస్ పాండ్ లో ‘లోటస్’ ఉంది
  • వైసీపీకి టీఆర్ఎస్, బీజేపీతో లాలూచీ ఉంది
  • జగన్ కోతలరాయుడు 
జగన్ లోటస్ పాండ్ కల్వకుంట్లలో ఉందని, ఆ లోటస్ పాండ్ లో ‘లోటస్’ కూడా ఉంది, అంటే, ‘కమలం’ అని, వైసీపీకి టీఆర్ఎస్, బీజేపీతో లాలూచీ ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చమత్కరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘అది చేస్తా, ఇది చేస్తా’ అంటూ కోతలరాయుడు జగన్ కోతలు కోస్తున్నాడని విమర్శించారు.

 వైసీపీ అంటే ఎవరికీ తెలియడం లేదని ‘కోడికత్తి పార్టీ’ అంటేనే తెలుస్తోందని సెటైర్లు విసిరారు. లోటస్ పాండ్ లో కూర్చుని జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్ కు లేదని, సొంత వ్యాపారాలు చేసుకుంటూ, దోచుకున్న ఆస్తులను కాపాడుకుంటూ కేసీఆర్ ఊడిగం చేసుకుంటూ బతుకుతున్నాడని విమర్శించారు.
Chittoor District
chandgragiri
Telugudesam
cm
babu

More Telugu News