mohan babu: చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబు కు ఏడాది జైలు శిక్ష

  • చెక్ బౌన్స్ కేసు వేసిన వైవీఎస్ చౌదరి
  • 2010లో కేసు వేసిన వైవీఎస్
  • ఏ1 లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2 మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను విధించింది. దీనికితోడు రూ. 41.75 లక్షలను చెల్లించాలని ఆదేశించింది. ఇదే సమయంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు రూ. 10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశించింది.  

సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. 2010లో ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. 'సలీం' సినిమా సందర్భంగా వైవీఎస్ చౌదరికి మోహన్ బాబు రూ. 40.50 లక్షల చెక్కును ఇచ్చారు. ఈ చెక్ నగదుగా మారకపోవడంతో వైవీఎస్ కోర్టులో కేసు వేశారు.  కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. కోర్టు తీర్పుతో మోహన్ బాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు, ఈ అంశంపై మంచు ఫ్యామిలీ ఇంత వరకు స్పందించలేదు.

More Telugu News