kareena: తెరపైకి సైఫ్ .. కరీనా కపూర్ తనయుడు తైమూర్

  • కరీనా నాయికగా 'గుడ్ న్యూస్' మూవీ 
  • సెప్టెంబర్ 6వ తేదీన భారీస్థాయి విడుదల 
  • ఈ సినిమాతో 'తైమూర్' పరిచయం

బాలీవుడ్ కథానాయకుడిగా సైఫ్ అలీఖాన్ .. అందాల కథానాయికగా కరీనా కపూర్ వెండితెరపై తమ జోరు చూపించారు. ఈ ఇద్దరి సంతానమే 'తైమూర్'.  సైఫ్ అలీఖాన్ .. కరీనా ఇద్దరూ కూడా తైమూర్ తో తాము దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం వలన, సహజంగానే అభిమానులకు ఈ కుర్రాడు చేరువైపోయాడు. రెండేళ్ల వయసున్న ఈ కుర్రాడి బొమ్మలను ఇటీవల కేరళలో అమ్మకానికి పెట్టడం ఈ కుర్రాడికి గల క్రేజ్ కి అద్దం పడుతోంది.

ముద్దుగా .. బొద్దుగా వుండే ఈ కుర్రాడు త్వరలో తెరపై కనిపించనున్నాడు .. అదీ తన తల్లి నటించే సినిమాలో కావడం విశేషం. రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ - కరీనా జంటగా నటిస్తోన్న 'గుడ్ న్యూస్' సినిమాలో 10 నిమిషాల పాటు తైమూర్ కనిపించనున్నాడు. ఈ కుర్రాడికి సంబంధించిన షూటింగును రీసెంట్ గా పూర్తి చేశారట. తైమూర్ ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ సినిమాను, సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. 

More Telugu News