Uttar Pradesh: ఆరోగ్యం బాగాలేదు.. అయినా ఓటు వేస్తా: 17వ సారి ఓటు వేయబోతున్న 107 ఏళ్ల వృద్ధుడు

  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంప్రసాద్ శర్మ వయసు 107 ఏళ్లు
  • 1951-52 నుంచి క్రమం తప్పకుండా ఓటేస్తున్న శర్మ
  • గ్రామంలోని ఓటర్లకు ఆయన స్ఫూర్తిప్రదాత అన్న కుమారుడు

70 ఏళ్ల ఈ స్వతంత్ర భారతావనిలో అత్యధికంగా లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఘనతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన 107 ఏళ్ల రాంప్రసాద్ శర్మ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా 17వ సారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖండౌలీ జిల్లాలోని సెమ్రా గ్రామానికి చెందిన శర్మ మాట్లాడుతూ.. తన ఆరోగ్యం అంతగా బాగాలేదంటూనే ఈసారి ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తానని చెబుతున్నారు.

‘‘నాకు ఆరోగ్యం బాగాలేదు. అయినా సరే తప్పకుండా ఓటు వేస్తా’’ అని శర్మ పేర్కొన్నారు. గ్రామంలోనే అతిపెద్ద వయస్కుడైన రాం ప్రసాద్.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామస్థులకు ఆయన స్ఫూర్తిదాత అని 75 ఏళ్ల రాంప్రసాద్ కుమారుడు  పేర్కొన్నారు. దేశంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో అంటే.. 1951-52లో రాంప్రసాద్ శర్మ తొలిసారి ఓటు వేశారు. ఇక అప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

More Telugu News