Gas: వంట గ్యాస్ ధర పెంపు!

  • రూ. 5 పెరిగిన వంట గ్యాస్ ధర
  • సబ్సిడీ రహిత సిలిండర్ పై వర్తింపు
  • రూ. 677 పెరిగిన విమాన ఇంధన ధర

రాయితీ లేని వంటగ్యాస్ ధర, విమాన ఇంధన ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) ధరను కిలో లీటర్ కు రూ. 677.10 పెంచారు. దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర రూ. 63,472.22 కు చేరింది. ఇదే సమయంలో 14.2 కిలోల బరువుండే నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 5 పెంచుతున్నట్టు ఓఎంసీలు తెలిపాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 706.50కి (సబ్సిడీ రహిత) చేరింది. ప్రస్తుతం ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ పరిమితి దాటితే, అధికంగా వెచ్చిస్తూ, మార్కెట్ ధరకు సిలిండర్ ను కొనుగోలు చేయాల్సి వుంటుంది.

More Telugu News