Telangana: ‘తెలంగాణ’ రాక ముందు, వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచించండి: సీఎం కేసీఆర్

  • ప్రతి రంగంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు
  • ఈరోజున దేశానికి రోల్ మోడల్ గా మనం నిలిచాం
  • రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓసారి ఆలోచించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి ఖనిలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, అప్పుడు విద్యుత్ సరఫరా ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? అదేవిధంగా పెన్షన్ అప్పుడు ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇలా ప్రతి రంగంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న మార్పును ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి రంగంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు మనకు కనిపిస్తాయని అన్నారు. ఈరోజున మనం దేశానికి రోల్ మోడల్ గా నిలిచామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని, అనేక రాష్ట్రాల వాళ్లు వచ్చి ఈ పథకాల గురించి అధ్యయనం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రామగుండంలో మెడికల్ కళాశాల తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా, చెన్నూరు రెవెన్యూ డివిజన్ నే ఏర్పాటు చేస్తామనిర, క్యాతన్ పల్లి, నర్సాపూర్, సీసీ నస్పూర్, మంచిర్యాల ప్రాంతాలను కలిపే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రైతు సమస్యలతో పాటు పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్వర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.     

  • Loading...

More Telugu News