Rajasekhar: అప్పుడు జీన్స్, కళ్లజోడే రాజశేఖర్‌ కొంపముంచాయట.. జగనే పార్టీ కార్యక్రమాలకు వద్దని చెప్పించారట!

  • వైసీపీలో చేరడం మొదటి సారేమీ కాదు
  • అప్పట్లో జలదీక్ష కార్యక్రమానికి హాజరైన రాజశేఖర్, జీవిత
  • హీరో స్టైల్లో రెడీ అయి వెళ్లిన రాజశేఖర్
  • ఈలలతో స్వాగతం పలికిన ప్రజలు
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి నేడు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే వారు వైసీపీలో చేరడం ఇది మొదటి సారేమీ కాదు, రెండోసారి వారిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిద్దరూ గతంలో వైసీపీలో ఉన్న సమయంలోనే జగన్, జలదీక్ష, ఫీజుదీక్ష చేశారు. ఆ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత ఇద్దరూ హాజరయ్యారు. అయితే రాజశేఖర్ జలదీక్ష కార్యక్రమానికి జీన్స్ వేసుకుని, కళ్లజోడుతో హీరో స్టైల్లో రెడీ అయి వెళ్లారట.

వేదికపైకి రాజశేఖర్, జీవిత వెళ్లగానే జనం ఈల వేస్తూ గ్రాండ్‌గా స్వాగతం పలకడంతో జగన్ కాస్త ఫీలయ్యారట. ఇకపై రాజశేఖర్ తమ కార్యక్రమాలకు హాజరు కానవసరం లేదని, జీవిత మాత్రం రాజకీయ కార్యక్రమాలకు హాజరైతే చాలని ఆయన సన్నిహితులు నేరుగా చెప్పేశారట. ఈ నేపథ్యంలో అప్పట్లో రాజశేఖర్, జీవిత మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వారు అదే వైసీపీలో చేరడం విశేషం.
Rajasekhar
Jeevitha
Jagan
Specticles
jeans

More Telugu News