Hyderabad: ‘కారు’ టీఆర్ఎస్ దే, స్టీరింగ్ మాత్రం ‘మజ్లిస్’ చేతిలో ఉంది: ప్రధాని మోదీ

  • ‘ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారు’
  • ‘మజ్లిస్’తో ఉన్న టీఆర్ఎస్ ప్రజలను పట్టించుకోవట్లేదు
  • పాతబస్తీకి ‘మెట్రో’ వద్దని మజ్లిస్ అడ్డుకోలేదా?

టీఆర్ఎస్ పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రధాన మంత్రి మోదీ విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, ‘కారు’ టీఆర్ఎస్ దే అయినా, స్టీరింగ్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని విమర్శించారు. ‘ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారు’ అన్నట్టు, మజ్లిస్ పార్టీతో సావాసం కారణంగా టీఆర్ఎస్ కూడా ప్రజల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొస్తామంటే మజ్లిస్ అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి భాష అర్థం కాదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి మజ్లిస్ పార్టీ స్పీడ్ బ్రేకర్ లాంటిదని నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ లో మూసీ నదికి ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. హైదరాబాద్ మెట్రో, ఢిల్లీ మెట్రోతో పోటీపడుతోందని, రామగుండం కు ఫెర్టిలైజర్ ప్రాజెక్టు, ఫుడ్ పార్క్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

More Telugu News