Pulwama: సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లకు ఇకమీదట ఎస్పీ ర్యాంకు అధికారులతో పర్యవేక్షణ

  • పుల్వామా దాడి పర్యవసానం
  • ఎస్కార్ట్ వెళ్లే బుల్లెట్ ప్రూఫ్ వాహనాల సంఖ్య పెంపు
  • కాన్వాయ్ కి 40 వాహనాలు పరిమితం

ఇటీవల జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకమీదట సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ల భద్రతను ఎస్పీ ర్యాంకు అధికారులు పర్యవేక్షించనున్నారు. జవాన్ల తరలింపు ప్రక్రియ యావత్తు ఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.అంతేకాకుండా, కాన్వాయ్ ల వెంట భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సైని వాహనాల సంఖ్యను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మరింత మెరుగైన రక్షణ కల్పించేందుకు వీలుగా ఒక్కో కాన్వాయ్ లో 40కి మించి వాహనాలు అనుమతించరాదని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం సరికొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోగ్రామ్-ఎస్ఓపీ) రూపొందించింది.

More Telugu News