YSRCP: నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లో... నేడు తిరిగి టీడీపీలోకి!

  • నిన్న వైసీపీలో చేరిన జంపాని తిరుపాలు
  • విషయం తెలుసుకుని టీడీపీ ఆఫీసుకు తీసుకు వచ్చిన బీద మస్తాన్ రావు
  • తిరిగి టీడీపీలో చేరిక
ఆయన నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి నేత. బీద మస్తాన్ రావు అనుచరుల్లో ఒకరు. శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, 24 గంటలు గడవకముందే నేడు తిరిగి సొంత పార్టీలోకి వచ్చేశారు. ఆయన పేరు జంపాని తిరుపాలు.  ఆముదాలదిన్నె పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు. ఇక తిరుపాల్ వైసీపీలో చేరారనే వార్త తెలుసుకున్న బీద మస్తాన్ రావు, ఈ ఉదయం కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆపై స్వయంగా పార్టీ కండువాను కప్పారు. ఈ సందర్భంగా తిరుపాలు మాట్లాడుతూ, కావలికి చెందిన కేతిరెడ్డి రామకోటారెడ్డి పొలం కౌలు వ్యవహారం మాట్లాడేందుకు తీసుకెళ్లి, తనకు వైసీపీ కండువా కప్పారని వ్యాఖ్యానించారు.
YSRCP
Telugudesam
Kavali
B Mastan Rao

More Telugu News