hema: లోటస్ పాండ్ లో జగన్ ను కలిసిన సినీ నటి హేమ

  • హేమను ఆప్యాయంగా పలకరించిన జగన్
  • గత ఎన్నికల్లో సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన హేమ
  • 'మా' ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన హేమ
పలువురు సినీ, బుల్లితెర నటులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఈరోజు మరో సినీ నటి హేమ వైసీపీ అధినేత జగన్ ను హైదరాబాదులోని ఆయన నివాసం లోటస్ పాండ్ లో కలిశారు. ఈ సందర్భంగా హేమను జగన్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి స్థాపించిన సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరోవైపు ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి... ఉపాధ్యక్షురాలిగా గెలుపొంది, సత్తా చాటారు.

ఈరోజు వైసీపీలో రాజశేఖర్, జీవిత, యాంకర్ శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డిలు కూడా చేరారు.
hema
actor
tollywood
ysrcp
Jagan

More Telugu News