Ranbir Kapoor: మే 11న పెళ్లి... రణబీర్, ఆలియా భట్ వెడ్డింగ్ కార్డ్ లీక్!

  • రాత్రి 8 గంటలకు పెళ్లి
  • పెళ్లి తరువాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్
  • హనీమూన్ కు గ్రీస్ వెళ్లనున్న జంట

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అతని ప్రేయసి, హీరోయిన్ ఆలియా భట్ ల వెడ్డింగ్ కార్డు ఆన్ లైన్లో లీక్ అయింది. వీరిద్దరూ ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మే 11న వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. రాత్రి 8 గంటలకు వీరి వివాహ వేడుక జరగనుందని ఈ వెడ్డింగ్ కార్డులో కనిపిస్తోంది. ఇటీవలే ఆలియా తల్లి, రణబీర్ తో తమ కుమార్తెకు ఎటువంటి రిలేషన్ లేదని, వారిద్దరూ మంచి స్నేహితులేనని చెప్పిన నేపథ్యంలో, వీరి పెళ్లి కార్డు బయటకు రావడం గమనార్హం.

ఇప్పటికే కొంతమంది వెడ్డింగ్ ప్లానర్స్ తో ఈ జంట మాట్లాడిందని సమాచారం. ఆలియా, రణబీర్ కపూర్ జంట వివాహం తరువాత ముంబైలో రిసెప్షన్ ఇచ్చి ఆపై హనీమూన్ నిమిత్తం గ్రీస్ లోని మైకూన్స్ కు వెళుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు రిషీ కపూర్, ఈ నెలలోనే ఇండియాకు తిరిగి వచ్చి వివాహ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రణబీర్ సోదరి రిధిమా కపూర్ ఈ పెళ్లికి ఆభరణాలను స్వయంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం.

More Telugu News