Madhura: గోధుమ పనలను పట్టుకుని... వినూత్నంగా ప్రచారం ప్రారంభించిన హేమమాలిని!

  • మధుర నుంచి పోటీ పడుతున్న డ్రీమ్ గర్ల్
  • గోధుమ పొలానికి వచ్చి మహిళలతో మాటా మంతీ
  • మరోసారి గెలిపించాలని వినతి
ఈ లోక్ సభ ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న డ్రీమ్ గర్ల్ హేమమాలిని, తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె, గోధుమ పొలాలకు వచ్చారు. అక్కడి మహిళలతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు చేస్తున్న పనిని తన చేతుల్లోకి తీసుకున్నారు. 2014లో తాను గెలిచిన తరువాత నియోజకవర్గానికి చాలా చేశానని, మరింత పనిచేసే అవకాశం తనకు కల్పించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

2004లో బీజేపీలో చేరిన హేమమాలిని, 2014లో రాష్ట్రీయ లోక్ దల్ అభ్యర్థి జయంతో చౌదరిపై విజయం సాధించారు. మధుర ప్రజలు తనపై ఎంతో ఆప్యాయతను చూపిస్తున్నారని, మరోసారి విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా, మధురలో రెండో దశలో భాగంగా, ఈ నెల 18న ఎలక్షన్ జరగనుంది. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 101 కోట్లని హేమమాలిని చూపించారు. ఐదేళ్ల క్రితం ఆమె ఆస్తులతో పోలిస్తే, ఇవి రూ. 34.46 కోట్లు అధికం.
Madhura
Hema Malini
Campaign
Elections
BJP

More Telugu News