pslv-c45: మరికాసేపట్లో రోదసిలోకి పీఎస్ఎల్వీ-సి45

  • శ్రీహరికోటలో సర్వం సిద్ధం
  • సోమవారం ఉదయం 9.27కి రోదసిలోకి రాకెట్
  • 29 ఉపగ్రహాలను తీసుకెళుతున్న పీఎస్ఎల్వీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం ఉదయం పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఉదయం 9.27 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ మేరకు షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం కోసం ఆదివారం ఉదయం 6.27 గంటల నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. కాగా, పీఎస్ఎల్వీ పరంపరలో ఇది 47వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మన దేశానికి చెందిన ఎమిశాట్ (ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్ మెంట్) ఉపగ్రహంతో పాటు ఇతర దేశాలకు చెందిన మరో 28 నానో ఉపగ్రహాలను కూడా పలు కక్ష్యల్లో ప్రవేశపెడతారు.

More Telugu News