Nizamabad District: నిజామాబాద్ లో ఈవీఎంల ద్వారానే జరగనున్న పోలింగ్

  • కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
  • తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు
  • ఎం-3 రకం ఈవీఎంలను అందించాలని ఆదేశం
ఈ నెల 11న లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారానా లేక బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారా? అనే విషయమై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. నిజామాబాద్ లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఎం-3 రకం ఈవీఎంలను, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ లను సరఫరా చేయాలని ఈసీఐఎల్ ను ఈసీ ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్ యంత్రాలు అందించాలని ఆదేశించినట్టు సమాచారం.
Nizamabad District
Elections
EVM`s
Ballet system

More Telugu News