Zaheerabad: ‘ఏప్రిల్ ఫూల్’ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ : టీ-మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు

  • రేపు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్
  • ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలి
  • సవాల్ విసిరిన జగదీశ్ రెడ్డి
ఏప్రిల్ 1న జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్ లో నిర్వహించే బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై టీ-మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు వేశారు. సూర్యాపేట జిల్లాలోని హూజూర్ నగర్ పాలకీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ‘ఏప్రిల్ ఫూల్’ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ హాజరుకానున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఉత్తమ్ కి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతోనే తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Zaheerabad
vanaparthi
Huzurnagar
jagadish

More Telugu News