Ponnam Prabhakar: రైతుకు కేసీఆర్‌ ఫోన్‌ చేయడం మీడియా హైప్‌ కోసమే : పొన్నం ప్రభాకర్‌

  • ఎన్నికల వేళ ప్రయోజనం పొందేందుకే కేసీఆర్‌ డ్రామా
  • ఆయన నియంతృత్వం వల్లే ఆ కుటుంబంలో వివాదం తలెత్తింది
  • దాన్ని కప్పిపుచ్చుకునే చర్య బెడిసి కొట్టింది
ఓ రైతు విన్నవించుకున్న సమస్యపై తక్షణం స్పందించి కేసీఆర్‌ అతనికి ఫోన్‌ చేయడం మీడియా హైప్‌కోసం గులాబీనేత సృష్టించిన ఎన్నికల స్టంట్‌ అని కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రభాకర్‌ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అరాచకవాదన్నారు. ఆయన నియంతృత్వ పోకడల వల్లే ఓ రైతు కుటుంబం మధ్య వివాదం తలెత్తిందని విమర్శించారు. దాన్ని కవర్‌ చేసుకోవడంతోపాటు మీడియా హైప్‌ క్రియేట్‌ చేస్తే ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చునన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ రైతుకు ఫోన్‌ చేసి పెద్ద కథ అల్లారని ఆరోపించారు.

అయితే ఈ ఎత్తుగడ కాస్తా బెడిసికొట్టిందని ధ్వజమెత్తారు. వినోద్‌కుమార్‌ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఊదరగొడుతున్నారని, ఆయన ఏ పార్టీలో అవుతారో ముందు చెప్పాలని మరోసారి కోరారు.
Ponnam Prabhakar
KCR
karimnagar

More Telugu News