Shreyas Ayyar: ఒట్టేసిన రబడా, దాన్ని నిలబెట్టుకున్నాడు: శ్రేయాస్ అయ్యర్
- రబడా పుణ్యమాని గట్టెక్కిన ఢిల్లీ కాపిటల్స్
- యార్కర్లు మాత్రమే వేస్తానని మాటిచ్చాడు
- సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుందని అనుకోలేదన్న శ్రేయాస్ అయ్యర్
ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్ ని, సూపర్ ఓవర్ వరకూ పొడిగించి, ఆపై రబడా పుణ్యమాని గట్టెక్కిన ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఇకపై కనీసం మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించేందుకు కృషి చేస్తామని అన్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్ ఓవర్ వేసే బాధ్యతను రబడాకు ఇచ్చే ముందు, అతనితో మాట్లాడానని చెప్పాడు.
తాను ఓవర్ లోని అన్ని బంతులనూ యార్కర్లుగా మాత్రమే వేస్తానని అతను మాటిచ్చాడని, అలాగే వేసి విజయాన్ని అందించాడని అన్నాడు. తమకసలు సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుందని ఊహించను కూడా లేదని చెప్పారు. ఇకపైనా పృథ్వీషా ధాటిగానే ఆడుతాడని భావిస్తున్నానని అన్నాడు. ఓ ప్రణాళికతో ఆటగాళ్లంతా కృషి చేయడంతోనే విజయం సాధించగలిగామని, ఇదే ఊపును తదుపరి మ్యాచ్ లలోనూ కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు.