Jeff Bezos: అమెజాన్ సీఈఓ జెట్ బెజోస్ ఫోన్ హ్యాక్!

  • సౌదీ హ్యాకర్ల చేతిలో బెజోస్ ఫోన్
  • వ్యక్తిగత సమాచారం దొంగతనం
  • సౌదీ అధికారుల ప్రమేయముందని ఆరోపణలు
అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ ను సౌదీ అరేబియాకు చెందిన కొందరు హ్యాక్ చేశారు. ఫోన్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు, జెఫ్ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారని జెఫ్ వ్యక్తిగత సిబ్బంది స్వయంగా వెల్లడించారు. సౌదీ అరేబియా అధికారులు దీని వెనకున్నారని, జర్నలిస్ట్ జమాల్ కషోగీ హత్య వెనుక సబంధముందని భావిస్తున్న వారితో ఈ హ్యాకింగ్ తో సంబంధముందని గవిన్ డీ బెకర్ ఆరోపించారు. 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రిక తమకు శత్రువని వారు భావిస్తున్నారని పేర్కొన్న డీ బెకర్, హ్యాకింగ్ వెనుక ఎవరున్నారన్న విషయమై స్పష్టంగా ఎవరి పేరునూ వెల్లడించలేదు. ఫోన్ హ్యాక్ పై ఫెడరల్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
Jeff Bezos
Phone
Hack
Saudi

More Telugu News