Srikalahasti: చంద్రబాబు చేసింది మోసమే... వైసీపీలో చేరుతున్నా: మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

  • శ్రీకాళహస్తి టికెట్ ను ఇస్తానని ఇవ్వలేదు
  • నేడు గూడూరులో జగన్ సమక్షంలో వైసీపీలోకి
  • ఇప్పటికే పార్టీ మారిన పలువురు
చంద్రబాబునాయుడు తనకు శ్రీకాళహస్తి టికెట్ ను ఇస్తానని చెప్పి, ఇవ్వకుండా మోసం చేశారని, అందువల్ల తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించిన మీదట, వారి కోరిక మేరకు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నానని ఆయన అన్నారు. నేడు గూడూరులో జరిగే వైఎస్ జగన్ బహిరంగ సభలో వైసీపీలో చేరనున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి తానెంతో సేవలు చేశానని, అయినా చివరికి నిరాశే మిగిలిందన్న ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాగా, ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీలో చేరారు. శ్రీకాళహస్తి దేవస్ధానం ట్రస్టు బోర్డు మాజీ ఛైర్మన్‌ కొండుగారి శ్రీరామమూర్తి, కౌన్సిలర్లు శరవణ, కంఠా ఉదయ్‌ తదితరులతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, ఆయన కుమారుడు మోహన్‌రెడ్డి తదితరులు వైసీపీలో చేరారు.
Srikalahasti
YSRCP
SCV Naidu
Telugudesam

More Telugu News