Telangana: కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు హిందువులను కించపరిచేలా ఉన్నాయి!: డీకే అరుణ ఫైర్

  • కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి
  • 13 మంది గెలిచినప్పుడు ఏం చేశారో చెప్పాలి  
  • బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలు సీఎం ఎవరో నిర్ణయిస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరో తేల్చుతాయని అన్నారు.

కేసీఆర్ తాను 16 స్థానాలు గెలిచి ఏదో ఒరగబెడతానని అంటున్నాడని, ఆయన గతంలో 13 మంది గెలిచినప్పుడు ఏంచేశారో చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని అని స్పష్టం చేశారు. అరుణ నిన్నటివరకు కాంగ్రెస్ లో ప్రముఖ నేతగా కొనసాగారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి వలస వెళుతుండడంతో, ఆమె కూడా కీలక నిర్ణయం తీసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News