Chandrababu: ​ జనసేనకు ఓటేస్తానన్న గర్భిణీపై వైసీపీ కార్యకర్తల దాడి పట్ల చంద్రబాబు స్పందన

  • వైసీపీకి ఓటేస్తే ఊరికో రౌడీ తయారవుతాడు
  • వీధికో కబ్జాకోరు పుట్టుకొస్తాడు
  • ఇచ్ఛాపురం సభలో చంద్రబాబు విమర్శలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జగన్ పైనా, వైసీపీ పైనా తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి చరిత్రతో పాటు ఎన్నో కేసులున్న వ్యక్తికి ఓటేస్తే ప్రజలను ఎవ్వరూ కాపాడలేరని, ఊరికో రౌడీ తయారవుతాడని, వీధికో కబ్జాకోరు పుట్టుకొస్తాడని హెచ్చరించారు.

మొన్నటికిమొన్న గాజువాకలో వైసీపీ వ్యక్తులు ఓ జనసేన మద్దతుదారుపై దాడి చేయడం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాము వైసీపీ ప్రచారానికి రాలేమని, జనసేనకే ఓటేస్తామని చెప్పినందుకు గర్భిణీ అని కూడా చూడకుండా దాడి చేయడం అత్యంత హేయమని అభిప్రాయపడ్డారు. కనికరం లేకుండా ఓ గర్భవతిపై దాడి చేయడం వైసీపీ కార్యకర్తలకే చెల్లిందని విమర్శించారు. పులివెందుల మార్కు ముఠాకక్షలు రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.
Chandrababu
Jagan
Jana Sena

More Telugu News