Pawan Kalyan: ​ పవన్ కల్యాణ్ బరిలో దిగడంతో గెలుపోటములు అంచనా వేయలేకపోతున్నాం: అంబికా కృష్ణ

  • ఏపీ ఓటర్లు తెలివైన వాళ్లు
  • ఎవరికి వెయ్యాలో వాళ్లకే వేస్తారు
  • సినీ గ్లామర్ జనాలను రప్పించడానికే..!
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) చైర్మన్ అంబికా కృష్ణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈసారి రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా పోటీచేస్తుండడం వల్ల ఫలితాలను అంచనా వేయలేకపోతున్నామని చెప్పారు. అయినా, ఏపీ ఓటర్లు ఎంతో తెలివైనవాళ్లని, ఎవరికి ఓటెయ్యాలో వాళ్లకు బాగా తెలుసని అన్నారు.

సినీ గ్లామర్ అనేది జనాలను సభలకు రప్పించడం వరకే పనిచేస్తుందని, ఓట్లు ఎవరికి వెయ్యాలన్నది ప్రజలే నిర్ణయించుకుంటారని అంబికా కృష్ణ స్పష్టం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు టాలీవుడ్ కళాకారులు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. సినిమా పరిశ్రమ అంతా తెలంగాణలోనే ఉండడం వల్ల ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్లు ఒత్తిడిలో ఉన్నారని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan

More Telugu News