Prakasam District: ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: వైఎస్ విజయమ్మ

  • వైఎస్ హయాంలో నిర్మించిన కాల్వలోకి నీరు తెచ్చి ‘పట్టిసీమ’ అంటారా?
  • ఈ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు
  • ప్రజా సంక్షేమమే వైఎస్ కుటుంబ ధ్యేయం
చంద్రబాబు ప్రభుత్వంలో ‘విశ్వసనీయత’ అనే పదానికి అర్థం లేదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ఏదైనా కొత్త ప్రాజెక్టు చంద్రబాబు తీసుకొచ్చారా? పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు? వైఎస్ హయాంలో నిర్మించిన కాల్వలోకి నీళ్లు తీసుకొచ్చి ‘పట్టిసీమ’ అని బాబు చెబుతున్నారని, ఈ ప్రాజెక్టు పేరిట వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

 వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టుల్లో ట్యాప్ లు తిప్పి తానే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికి చంద్రబాబు ‘జగన్ నామస్మరణ’ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమమే వైఎస్ కుటుంబ ధ్యేయమని, ‘నవరత్నాలు’ ద్వారా స్వర్ణయుగం వస్తుందని అన్నారు.
Prakasam District
Erragondapalem
ys
Vijayamma

More Telugu News