sayesha saigal: పెళ్లి తరువాత షూటింగుకి హాజరైన సాయేషా సైగల్

  • తమిళంలో పలకరించిన విజయాలు
  • అక్కడి యూత్ లో మంచి క్రేజ్
  • కన్నడలో తొలి అవకాశం
తెలుగు .. హిందీ భాషల్లో నటించినప్పటికీ, సాయేషా సైగల్ కి తమిళ సినిమాలే కలిసొచ్చాయి. తమిళంలో ఆమెకి సక్సెస్ లభించడమే కాకుండా .. అక్కడి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె అక్కడ సినిమాలు చేస్తూనే .. నటుడు ఆర్య ప్రేమలోపడి అతణ్ణి పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఈ ఇద్దరి వివాహం వైభవంగా జరిగింది.

పెళ్లి కారణంగా విరామం తీసుకున్న ఆమె, తాజాగా మళ్లీ షూటింగుకి హాజరైంది. తొలిసారిగా కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన 'యువరత్న' సినిమాలో నటిస్తోంది. బెంగుళూరులో జరుగుతోన్న షూటింగులో ఆమె జాయిన్ అయింది. ఇక తమిళంలో ఆమె 'కాప్పన్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె భర్త 'ఆర్య' కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉండటం విశేషం. తమిళంతోపాటు కన్నడలోను సాయేషా బిజీ అవుతుందేమో చూడాలి.
sayesha saigal
aarya

More Telugu News