Guntur: ఈ ఐదేళ్లలో ఎన్ని వెన్నుపోట్లు పొడిచారో: చంద్రబాబుపై షర్మిళ ఫైర్

  • నిజం చెప్పకూడదన్న శాపం చంద్రబాబుకు ఉంది
  • 600 హామీలిచ్చి ఎందుకు నెరవేర్చలేదు
  • ఎన్నికల ముందు ‘నిరుద్యోగ భృతి’, ‘పసుపు-కుంకుమ’ పథకాలా?

నిజం చెప్పకూడదన్న శాపం చంద్రబాబుకు ఉందని, ఒకవేళ నిజం చెబితే ఆయన తలకాయ వెయ్యి ముక్కలు అయిపోతుందని, అందుకే, బాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ నేత షర్మిళ సెటైర్లు విసిరారు. గుంటూరులోని మాయాబజార్ సెంటర్ లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన ఏ ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఈ ఐదేళ్లలో ఎన్ని వెన్నుపోట్లు పొడిచారోనని, 600 హామీలిచ్చిన చంద్రబాబు, వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు, కుక్క పిల్లలకు బిస్కెట్లు వేసినట్టుగా ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, పసుపు-కుంకుమ వంటి పథకాలను తీసుకొచ్చారని షర్మిళ విమర్శించారు. ఆడపిల్ల పుట్టిన ఇంటికి రూ.25 వేలు, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మహిళలకు స్మార్ట్ ఫోన్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ పలు హామీలిచ్చిన చంద్రబాబును నెరవేర్చమని నిలదీయాలని, బాకీపడ్డవన్నీ తీర్చమని అడగడం ప్రజల హక్కు అని ప్రజలకు సూచించారు. 

More Telugu News