Guntur District: నరసరావుపేట నియోజకవర్గంలో రేపు షర్మిళ బస్సు యాత్ర

  • ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేత షర్మిళ బిజీ
  • గుంటూరులో వరుస రోడ్ షోలు
  • రేపు నరసరావుపేటలో బస్సుయాత్ర
ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేత షర్మిళ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆమె ఉన్నారు. పలు రోడ్ షోలలో ఆమె పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం గుంటూరులోని నందివెలుగు రోడ్డు నుంచి రోడ్ షో ప్రారంభించారు. అది ముగిసిన అనంతరం, మధ్యాహ్నం మూడు గంటలకు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజా నుంచి తిరిగి రోడ్ షో ప్రారంభం కానుంది. రేపు నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించే బస్సుయాత్రలో షర్మిళ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Guntur District
Narasaraopet
YSRCP
sharmila

More Telugu News