nithin: నితిన్ కొత్త చిత్రం టైటిల్ 'పవర్ పేట'

  • కృష్ణ చైతన్యతో నితిన్ 
  • మూడు భాషల్లో నిర్మాణం
  •  త్వరలో మిగతా వివరాలు

ఈ రోజున నితిన్ పుట్టినరోజు ..ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఏడాదికి పైగా ఆయన ఈ స్క్రిప్ట్ పై కసరత్తు చేసి నితిన్ ను మెప్పించాడట. ఇది ఇంతవరకూ నితిన్ చేయని పాత్రని అంటున్నారు.

ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయనున్నారనీ .. దాదాపు ఇదే టైటిల్ ఖరారు అవుతుందని చెబుతున్నారు. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాను .. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో రూపొందించనున్నట్టు సమాచారం. ఈ మూడు భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ఉంటారని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

More Telugu News