Guntur District: వైసీపీ ‘సింగిల్’గా వచ్చినా బంపర్ మెజార్టీ సాధిస్తుంది: వైఎస్ షర్మిళ

  • మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే జగన్ సీఎం కావాలి
  • బాబు వస్తే జాబు కాదు.. కరవు వచ్చింది
  • ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ‘బై బై’ చెబుదాం
వైసీపీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగినా బంపర్ మెజార్టీ సాధిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయని ఆ పార్టీ నేత వైఎస్ షర్మిళ ప్రస్తావించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలోకి రావాలని, వెన్నుపోటు చంద్రబాబు పోవాలంటే, చెప్పింది చేసేవాడు కావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే తమ పార్టీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని, జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిళ కోరారు. జాబు కావాలంటే బాబు రావాలని, బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు కానీ, బాబు వస్తే కరవు వచ్చింది తప్ప ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ‘బై బై’ చెబుదామని వ్యాఖ్యానించారు.  
Guntur District
Mangalagiri
YSRCP
Sharmila

More Telugu News